ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్‌లో భూగర్భ మెట్రో.. ఎక్కడి నుంచి ఎక్కడివరకో తెలుసా - First underground metro in Hyderabad

Underground Metro in Hyderabad: మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో భూగర్భ మెట్రో రానుంది. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టనున్న 31 కి.మీ మెట్రో కారిడార్‌లో విమానాశ్రయం సమీపంలో 2.5 కి.మీ. అండర్‌ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్‌లో భూగర్భ మెట్రో
హైదరాబాద్‌లో భూగర్భ మెట్రో

By

Published : Nov 29, 2022, 7:53 PM IST

Underground Metro in Hyderabad: హైదరాబాద్ వాసులకు శుభవార్త. త్వరలో నగరంలో భూగర్భ మెట్రో రానుంది. త్వరలో చేపట్టబోయే రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్​ పోర్ట్​ లైన్​లో 2.5 కిలోమీటర్ల వరకు భూగర్భ మెట్రో ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న 31 కిలోమీటర్ల కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్​లో మెట్రో సేవలు ప్రారంభమై ఐదేళ్లు అవుతున్న సందర్భంగా అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగరవాసుల నుంచి మెట్రోకు మంచి స్పందన వస్తుందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్‌ అందుబాటులోకి వచ్చిన మొదటి రోజే రెండు లక్షల మంది ప్రయాణించారని వెల్లడించారు. ప్రస్తుతం నిత్యం నాలుగు లక్షల 40వేల మంది ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.

రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు (31కి.మీ.) మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9వ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మూడు కారిడార్లలో 69.2 కి.మీ. మేర మెట్రో నడుస్తోందని ఎల్‌ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రోలో 31కోట్ల మంది ప్రయాణించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details