ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో చివరిరోజు భారీగా నామినేషన్లు

మెుదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమర్పణకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో... గుంటూరు జిల్లావ్యాప్తంగా నామపత్రాల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. రెండు రోజులు మందకొడిగా సాగినప్పటికిీ నేడు జోరుందుకుంది. కొన్నిచోట్ల మినహా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది.

nominations
నామినేషన్లు దాఖలు

By

Published : Jan 31, 2021, 5:53 PM IST

గుంటూరు జిల్లాలో పల్లె పోరు తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. ఇవాళ అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పొన్నూరు రూరల్ పరిధిలోని గ్రామాల్లో... అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలసి వచ్చి రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలను సమర్పించారు.

తెనాలి డివిజన్ పరిధిలో నామినేషన్ల పక్రియ ఊపందుకుంది. కాకుమాను మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచి అభ్యర్థులు, వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు జరుపుకునేందుకు స్థానిక నాయకులతో ముమ్మరంగా చర్చలు జరిగాయి. రేపటినుంచి ప్రచారం చేసుకునేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే నిన్నటివరకు జిల్లావ్యాప్తంగా సర్పంచ్ పదవులకు 696, వార్డు మెంబర్లకు 2వేల 531 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇదీ చదవండి:'సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేస్తారా..ఏమిటీ ఆటవిక సంస్కృతి ?'

ABOUT THE AUTHOR

...view details