ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్లలో కరోనా.. మొదటి పాజిటివ్ కేసు నమోదు! - first cases in piduguralla at guntur dst

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మొదటి కరోనా కేసు నమోదు
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మొదటి కరోనా కేసు నమోదు

By

Published : Apr 27, 2020, 7:21 PM IST

Updated : Apr 27, 2020, 7:42 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దాచేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి (29)... ఓ ల్యాబ్ టెక్నీషియన్ వద్ద షుగర్ పరీక్ష చేయించుకున్నాడు. సదరు టెక్నీషియన్​కు తర్వాత కరోనా సోకింది. కొన్నాళ్లకు.. విపరీతమైన దగ్గు, శ్వాస సమస్యతో పిడుగురాళ్ల పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ వ్యక్తి చికిత్స చేయించుకున్నాడు. అనుమానంతో కరోనా పరీక్ష చేయగా... అతనికి కరోనా నిర్ధరణ అయ్యింది. ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారాని గురజాల ఆర్డీవో పార్థసారధి తెలిపారు.

Last Updated : Apr 27, 2020, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details