గుంటూరు జిల్లా తాడికొండ నియోజక వర్గం కరోనా కలకలం రేపింది. పిరంగిపురానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం మండలంలో తొలి కేసు నమోదైంది. కోల్‌కతాలో ప్రైవేట్ వైద్యుడుగా పని చేస్తున్న వ్యక్తి ఈనెల 8న గ్రామానికి వచ్చాడు. అతనికి పరీక్షలు జరిపించగా శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అతనిని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించి, ఇంటికి 200 మీటర్ల దూరం వరకు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మరో 200 మీటర్లు బఫర్ జోనుగా ప్రకటించి, ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
కోల్‌కతా నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా.. పిరంగిపురానికి కరోనా
కోల్‌కతా నుంచి గుంటూరు జిల్లా తాడికొండ నియోజక వర్గం పిరంగిపురానికి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ప్రత్యేక పారిశుద్థ్య పనులు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధమున్న వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించారు.
కోలకత్త నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా పిరంగిపురానికి కరోనా