గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కొండలపై ఆకస్మికంగా మంటలు చుట్టుముట్టాయి. బోయపాలెం జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీపార్వతిదేవి ఆలయం వెనుక ఉన్న కొండలపై మంటలు చేలరేగడాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 100 మీటర్ల వరకు కొండపైకి మంటలు వ్యాపించాయి. బోయపాలెం నుంచి సంగంగోపాలపురం వైపు గాలి వీయడంతో ఆ దిశగా మంటలు వెళ్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకురావాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కొండవీడు కొండలపై మంటలు.. భయాందోళనలో ప్రజలు - FIRES ON KONDAVEEDU HILLS NEWS
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం హైవే సమీపంలోని కొండవీడు కొండలపై మంటలు చెలరేగడం స్థానికులు గుర్తించారు. అప్పటికే కొండపైకి 100 మీటర్ల వరకు మంటలు వ్యాపించాయి. అధికారులు స్పందించి వెంటనే అదుపు చేయాలని సమీప గ్రామాల ప్రజలు కోరారు.
కొండవీడు కొండలపై మంటలు