గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చెన్నై నుంచి తెనాలి వస్తున్న కారు.... సీఆర్ కళాశాల సమీపంలోకి రాగానే ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి. అందులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై కిందికి దిగిపోవటంతో తృటిలో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కాగా... రెండు ల్యాప్ టాప్‌లు, 15 వేల రూపాయలు, దుస్తులు బూడిదైయ్యాయి.
ప్రయాణిస్తున్న కారులో మంటలు... తప్పిన ప్రాణాపాయం - news updates in guntur district
గుంటూరు జిల్లా గణపవరం వద్ద ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.

ప్రయాణిస్తున్న కారులో మంటలు