గుంటూరు ఆటోనగర్‌లో వెల్డింగ్ షాప్‌లో పనిచేసే శ్రీనివాసరావు లారీ ఆయిల్ ట్యాంకర్‌కి మరమత్తులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఆయిల్ ట్యాంక్‌కు వ్యాపించి ఒక్కసారిగా ట్యాంక్ పేలింది. దీంతో వెల్డింగ్ చేస్తున్న శ్రీనివాసరావుకి , పక్కనే ఉన్న చిట్టి బాబుకి గాయాలయ్యాయి. శ్రీనివాసరావు శరీరం సగంపైగా కాలిపోయింది. క్షతగాత్రులను స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉంది. చిట్టిబాబుకి చిన్నపాటి గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
వెల్డింగ్ షాపులో ఆయిల్ ట్యాంక్ పేలి ఇద్దరికి తీవ్ర గాయలు - taja news of guntur autonagar fire accident in welding shed
గుంటూరు ఆటోనగర్‌లో వెల్డింగ్ షాపులో ఆయిల్ ట్యాంక్ పేలి ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
![వెల్డింగ్ షాపులో ఆయిల్ ట్యాంక్ పేలి ఇద్దరికి తీవ్ర గాయలు fire burned in guntur dst autonagar two injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8589690-106-8589690-1598605736612.jpg)
fire burned in guntur dst autonagar two injured