ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

fire at kaza toll gate: మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్‌ వద్ద అగ్నిప్రమాదం - AP News

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్‌( kaza toll gate) వద్ద అగ్నిప్రమాదం జరిగింది. టోల్‌ రుసుము చెల్లిస్తుండగా లారీలో నుంచి మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే లారీ డ్రైవర్‌, టోల్‌గేట్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రాణాపాయం తప్పింది. టోల్‌గేట్‌లోని క్యాష్ కౌంటర్లకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక యంత్రంతో సిబ్బంది మంటలార్పారు.

కాజా టోల్‌గేట్‌ వద్ద అగ్నిప్రమాదం
కాజా టోల్‌గేట్‌ వద్ద అగ్నిప్రమాదం

By

Published : Jun 10, 2021, 7:11 PM IST

Updated : Jun 10, 2021, 8:09 PM IST

కాజా టోల్‌గేట్‌ వద్ద అగ్నిప్రమాదం

మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్‌( kaza toll gate) వద్ద అగ్నిప్రమాదం జరిగింది. టోల్‌ రుసుము చెల్లిస్తుండగా ఒక్కసారిగా లారీ టైరు పేలింది. ఇంధన ట్యాంకుకు వ్యాపించి మంటలు భారీగా ఎగసిపడ్డాయి. లారీ డ్రైవర్‌, టోల్‌గేట్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రాణాపాయం తప్పింది. రెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పారు. అగ్నిప్రమాదంలో టోల్‌గేట్‌లోని 2 క్యాష్ కౌంటర్లు దగ్ధం అయ్యాయి. లారీని క్రేన్‌ సాయంతో టోల్‌గేట్‌ సిబ్బంది పక్కకు తొలగించారు. రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు టోల్‌గేట్‌ నిర్వాహకుల అంచనా వేస్తున్నారు. టోల్‌గేట్‌ నుంచి యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి.

Last Updated : Jun 10, 2021, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details