ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

fire accident: యడ్లపాడులోని వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు జిల్లాలోని ఓ వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. యడ్లపాడు, చిలకలూరిపేటతో పాటు గుంటూరు నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

fire accident
fire accident

By

Published : Sep 24, 2021, 10:07 PM IST

Updated : Sep 25, 2021, 12:38 AM IST

గుంటూరు జిల్లా మండల కేంద్రమైన యడ్లపాడు వద్ద చెన్నై- కోల్‌కతా 16- నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్​ఎస్​ఎల్ టెక్స్ టైల్స్ పరిశ్రమలో(fire accident in textile industry) శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి.

పరిశ్రమలో ఉన్న నాలుగు అతిపెద్ద గోదాములలో పత్తి బేళ్లు నిల్వ ఉన్నాయి. వీటిలోని ఒక దాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు ప్రాంతాల నుంచి ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. గోదాములకు ఎలాంటి విద్యుత్ సరఫరా కూడా ఉండదు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉందని పరిశ్రమ జీఎం నరసింహరావు తెలిపారు. నష్టం కోట్లలో ఉండవచ్చని తెలిపారు.

జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంఘటనపై యడ్లపాడు పోలీసులు విచారించి నివేధిక అందజేయాలని కోరనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి

RECORDING DANCE : ఎంపీపీ ప్రమాణస్వీకారంలో రికార్డింగ్ డ్యాన్సులు

Last Updated : Sep 25, 2021, 12:38 AM IST

ABOUT THE AUTHOR

...view details