గుంటూరులోని జేకేసీ కళాశాల వద్ద ఉన్న ఎక్సెల్ బ్రాండ్ ఇంటర్నెట్ ప్రొవైడర్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దుకాణంలో ఉన్న పరికరాలన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుకాణంలో అగ్నిప్రమాదం.. సుమారు రూ.3 లక్షలు నష్టం - సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం
గుంటూరులో విద్యుదాఘాతం కారణంగా ఓ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ.3లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుకాణంలో అగ్నిప్రమాదం