ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్ని ప్రమాదం : గ్యాస్ లీకై , ఇల్లు, రెండు పాకలు దగ్ధం - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లా కొల్లూరు మండలం రావికంపాడు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చేలరేగాయి. అదే సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవడంతో ఇల్లు, రెండు గేదెల పాకలు, గడ్డివామి అగ్నికి అహూతయ్యాయి.

అగ్నికి పూర్తిగా దగ్దమైన ఇల్లు
అగ్నికి పూర్తిగా దగ్దమైన ఇల్లు

By

Published : Apr 11, 2021, 6:07 AM IST

గుంటూరు జిల్లా కొల్లూరు మండలం రావికంపాడు గ్రామంలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. అదే సమయంలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ అవడంతో మంటలు చెలరేగాయి. ఫలితంగా అ ఇంట్లోని వారు భయాందోళనతో బయటకు పరుగెత్తారు. ఇంటితో పాటు పక్కనే ఉన్న రెండు గేదెల పాకాలు దగ్ధమయ్యాయి.

గడ్డి వాము పూర్తి దగ్దం..

పక్కనే ఉన్న గడ్డివాము కూడా పూర్తిగా కాలిపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు మంటలు అర్పడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం కనిపించలేదు. తెనాలి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా... అగ్ని మాపక వాహనం వచ్చే సరికి ఇల్లు పూర్తిగా కాలి బూడిద అయింది. ఇంట్లో 40 వేల రూపాయలు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

'మమ్మల్ని ఆదుకోవాలి'

ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థిక సాయం అందించాలని బాధితులు కోరుతున్నారు. రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేసినట్లు అగ్ని మాపక స్టేషన్ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

ద్విచక్రవాహనం ఢీకొని కిందపడిన మహిళ... లారీ రూపంలో కబళించిన మృత్యువు

ABOUT THE AUTHOR

...view details