గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల గోదాములో ప్రమాదం జరగడంతో.. మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగన అగ్నిమాపక సిబ్బంది.. ఫోమ్ ఉపయోగించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో కారణాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే ప్రమాదంపై ఒక అంచనాకు రావచ్చని అన్నారు. సుమారు 10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు గోదాము యజమాని చెప్పారు.
మంగళగిరిలో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ వ్యర్థాల గోదాము దగ్ధం - guntur news
fire accident
09:07 April 17
కారణాలు అన్వేషిస్తున్న అధికారులు
Last Updated : Apr 17, 2022, 10:22 AM IST