గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం.. రూ. లక్షల్లో ఆస్తి నష్టం - గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం
21:06 May 31
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
Fire Accident: గుంటూరు ఆటోనగర్ ఫేజ్-1లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాత వాహనాలు మరమ్మతులు చేసే దుకాణాల సముదాయంలో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో పాత వాహనాలు, సిలిండర్లు, డీజిల్ డబ్బాలు, యంత్రపరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షలాది రూపాయల విలువైన పాత లారీలు, కార్లు, ఆటోమొబైల్ పరికరాలు దగ్ధమయ్యాయి. లారీలు, కార్లలో ఉండే డీజిల్ ట్యాంకులు పేలడంతో పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.
ఇవీ చూడండి