చిలుకలూరిపేట మణికంఠ కాటన్ మిల్లుకు చెందిన ఇద్దరు యువకులు పని నిమిత్తం కారులో గుంటూరులోని బ్రాడీపేటకు వచ్చారు. భోజన సమయంలో వాహనాన్ని ఓ హోటల్ పక్కనే పార్కింగ్ చేసి లోపలికి వెళ్లారు. అంతలోనే కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గాలికి మంటలు పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ తీగలకు వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు యువకులు పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బ్రాడీపేటలో కారులో చెలరేగిన మంటలు...వాహనం దగ్ధం - గుంటూరు బ్రాడిపేటలో అగ్నిప్రమాదనికి గురైన కారు
బ్రాడీపేటలో ఓ కారులో మంటలు చెలరేగాయి. పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ తీగలకు మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది.
బ్రాడిపేట వద్ద ఓ కారులో చెలరేగిన మంటలు