రేపల్లెలో అగ్నిప్రమాదం- రెండు పూరిల్లు దగ్ధం - రేపల్లెలో అగ్నిప్రమాదం
గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు పూరిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
![రేపల్లెలో అగ్నిప్రమాదం- రెండు పూరిల్లు దగ్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4363559-thumbnail-3x2-fire.jpg)
గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని రెండవ వార్డ్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో రెండు పూరిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఓ ఇంటి వద్ద ఉన్న కారు కూడా అగ్నిప్రమాదంలో కొంత మేర కాలిపోయింది. అందరూ నిద్రపోతున్న సమయంలో ఘటన జరగడంతో...ఉలిక్కిపడ్డ స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండ అదుపుచేశారు. ప్రమాదంలో సుమారు 6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగుంటుందని అధికారులు తెలిపారు.