గుంటూరు బ్రాడీపేటలోని ఓ హోటల్‌లోని వంట గదిలో సిబ్బంది పనిచేస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరాగాయి. అప్రమత్తమైన సిబ్బంది... గదిలోని సిలిండర్లను బయటకు తరలించి, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం కలగకపోవటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
హోటల్ వంటగదిలో అగ్ని ప్రమాదం... సిబ్బంది సురక్షితం - guntur crime news
గుంటూరులోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. వంటగదిలో సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం కలగలేదు.
హోటల్ వంటగదిలో అగ్ని ప్రమాదం