గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పొలకంపాడు వద్ద ఉన్న కొండపై నిప్పు రాజుకుంది. ముగ్గురోడ్, సంజీవనగర్ ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పొగ కమ్ముకుంది. కొండ దిగువన నివాసం ఉన్న వారు ఆందోళన చెందారు. భారీగా అగ్నికీలలు ఎగిసిపడటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
పొలకంపాడు కొండపై మంటలు.. ఆందోళనలో స్థానికులు
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పొలకంపాడు వద్ద ఉన్న కొండపై అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
fire accident at polakampadu hill station
మంగళగిరి నుంచి రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా సిబ్బంది.. చర్యలు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.