ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక వైపు సభ.. మరో వైపు అగ్ని కీలలు! - గుంటూరు తాజా సమాచారం

గుంటూరు జిల్లా మాచర్లలో ఓ వైపు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగా.. మరో వైపు అగ్ని మంటలు వ్యాపించాయి. సకాలంలో స్పందించిన పోలీసులు మంటలను అదుపు చేసి ప్రజలను రక్షించారు.

fire accident at macharla in guntur district
ఒక వైపు సభ.. మరో వైపు అగ్ని కిలలు.. అదుపు చేసిన పోలీసులు

By

Published : Jan 9, 2021, 6:51 AM IST

గుంటూరు జిల్లా మాచర్లలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ ఘటన పోలీసులను పరుగులు పెట్టించింది. ఓ వైపు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సభ జరుగుతోంది. సభ ఎంతో ఉత్సాహంగా సాగుతున్న క్రమంలో.. కొద్ది దూరంలోనే మంటలు చెలరేగాయి. దావాలంలా వ్యాపిస్తున్న మంటలను అక్కడే బందోబస్తులో ఉన్న వెల్దుర్తి ఎస్సై గమనించారు.

వెంటనే పోలీసు సిబ్బందితో కలసి ఉరుకులు పరుగుల మీద అగ్ని కీలలు చెలరేగుతున్న ప్రాంతానికి చేరారు. అప్పటికప్పుడు నీళ్ల క్యాన్లను హుటాహుటిన తెప్పించి మంటలను అదుపు చేశారు. ఎవరికీ అపాయం కలగకపోవడంపై... అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details