ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్​లో ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణాపాయం - Fire Accident Gudimalkapur

Fire Accident at Gudimalkapur in Hyderabad : హైదరాబాద్​లోని గుడిమల్కాపూర్​లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.

Fire Accident at Gudimalkapur in Hyderabad
Fire Accident at Gudimalkapur in Hyderabad

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 6:57 PM IST

Fire Accident at Gudimalkapur in Hyderabad : హైదరాబాద్​లోని గుడిమల్కాపూర్​లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆరు అంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సౌత్‌ఈస్ట్‌ డీసీపీ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.

హైదరాబాద్​ - ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details