గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఎన్ఆర్టీసెంటర్లో నవయుగ హోటల్ పక్కన ఉన్న పాత పేపర్లు, ఇనుప సామాన్ల దుకాణంలో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలోని సరుకుకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
FIRE ACCIDENT: చిలకలూరిపేటలో అగ్నిప్రమాదం - గుంటూరు జిల్లా తాాజా సమాచారం
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
fire