గుంటూరు శివారు పేరేచర్ల వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన నగరవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎవరో సందర్శకులు సిగరెట్ కాల్చి పడేయడంతో మంటలు అలుముకున్నాయి. క్రమేణా వనమంతా వ్యాపించి పూలచెట్లు, మొక్కలు దగ్దమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
గుంటూరు శివారు నగరవనంలో అగ్నిప్రమాదం