ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలగపూడిలో ఘర్షణపై ఎఫ్ఐఆర్.. ఎంపీ పేరును చేర్చని పోలీసులు!

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ మృతిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్​ పేరు చేర్చాలన్న బాధితుల డిమాండ్​ను పక్కన పెట్టారు.

FIR registered on velagapudi incident
వెలగపూడి ఘర్షణపై ఎఫ్ఐఆర్ నమోదు

By

Published : Dec 29, 2020, 1:39 PM IST

వెలగపూడిలో జరిగిన ఘర్షణలో మొత్తం 36 మందికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎంపీ నందిగం సురేశ్​ అనుచరులు దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. మరియమ్మ కుమారుడు మెండెం బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 147, 148,302, 324, 109 కింద కేసులు నమోదు చేశారు. ఇక.. నిందితుల జాబితాలో నందిగం సురేశ్​ పేరు చేర్చాలనే డిమాండ్​ చేస్తూ.. మరియమ్మ బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టగా.. వారిని కలిసిన హోం మంత్రి సుచరిత.. సరేనని హామీ ఇచ్చారు.

అలాగే... 10లక్షల పరిహారానికి సంబంధించిన చెక్కుని అందజేశారు. హోం మంత్రి హామీతో ఆందోళన విరమించిన బంధువులు మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు... మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులోని పేర్లను యథాతథంగా ఉంచారు. ఎంపీ నందిగం సురేశ్ పేరును మాత్రం అందులో చేర్చలేదు. ఎంపీ​ ప్రోద్బలంతో దాడి జరిగిందని, తమ పల్లెలో చాలామందిని హతమార్చాలని చూస్తున్నారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నా.. పోలీసులు పట్టించుకోలేదు.

ఇదీ చదవండి:

వెలగపూడిలో మరోసారి ఉద్రిక్తత.. మరియమ్మ మృతదేహంతో ఆందోళన

ABOUT THE AUTHOR

...view details