గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. పట్టణంలోని పల్నాడు రోడ్డులోని చెక్ పోస్ట్ వద్ద మున్సిపల్ సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గస్తీ నిర్వహించి ప్రధాన రహదారిపై మాస్క్ లేకుండా తిరుగుతున్న 20 మందిని గుర్తించారు. వారందరికీ కరోనా వ్యాప్తిపై కౌన్సెలింగ్ నిర్వహించి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. మాస్క్ లేకుండా తిరిగే వారు ఒకసారి వెయ్యి రూపాయలు జరిమానా కడితే వారికి నెల రోజులు గుర్తుండి తప్పనిసరిగా మాస్క్ లు వాడతారని, లేదంటే మరలా మరో వెయ్యి రూపాయలు జరిమానా కట్టాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు. పట్టణంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు కఠినంగా అమలులో ఉంటాయని బయటకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరరావు పట్టణ ప్రజలను కోరారు.
మాస్క్ లేకుండా తిరిగారా....? తప్పదు భారీ మూల్యం - గుంటూరు జిల్లా, నరసరావుపేట
నరసరావుపేటలో మాస్క్ లేకుండా తిరుగుతున్న 20 మందికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. పట్టణంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు కఠినంగా అమలులో ఉన్నందున బయటకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు పట్టణ ప్రజలను కోరారు.
![మాస్క్ లేకుండా తిరిగారా....? తప్పదు భారీ మూల్యం guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7554219-551-7554219-1591773903188.jpg)
మాస్క్ లేకుండా తిరిగారు.. జరిమానా తప్పలేదు