గుంటూరు జిల్లా పిరంగిపురానికి చెందిన విప్పర్ల ప్రసాదు అచ్చంపేట మండలం వ్యవసాయ అధికారిగా పని చేస్తూ జులై 3న అనారోగ్యంతో మరణించాడు. మృతుడి కుటుంబానికి వ్యవసాయాధికారులు సంఘం తరుపున ఆర్ధిక సాయం అందించారు. మృతుడు కుటుంబానికి రూ.6.75 లక్షలు విలువ గల చెక్కును అందించినట్లు జిల్లా వ్యవసాయ సహాయసంచాలకులు విజయభారతి తెలిపారు. ఏవో కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. సభ్యులు అందరి సహకారంతో ఆర్ధిక సాయం అందించినట్లు వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సునీల్ తెలిపారు.
చనిపోయిన ఏవో కుటుంబానికి అండగా నిలిచిన సహోద్యోగులు - గుంటూరు జిల్లా తాదా వార్తలు
గుంటూరు జిల్లా పిరంగిపురం అచ్చంపేట మండలంలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తూ చనిపోయిన విప్పర్ల ప్రసాద్ కుటుంబసభ్యులకు తోటి ఉద్యోగులు ఆర్థిక సాయం చేశారు. రూ. 6.75లక్షలు విలువ గల చెక్కును బాధితుడి కుటుంబ సభ్యులకు జిల్లా వ్యవసాయ సహాయసంచాలకులు విజయభారతి అందించారు.
financial help to ao family due to his died by illhealth in guntur dst phirngipuram