ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్​క్రైమ్​లో ఫిర్యాదు.. ఎందుకంటే? - dsp latest news

COMPLAINT ON DEVI SRI PRASAD : దేవుని మంత్రాన్ని ఓ ఐటెం సాంగ్​లో వాడారంటూ ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్​పై హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​లో ఫిర్యాదు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పాటను రూపొందించారని.. వెంటనే దేవీశ్రీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

COMPLAINT ON DEVI SRI PRASAD
COMPLAINT ON DEVI SRI PRASAD

By

Published : Nov 2, 2022, 5:42 PM IST

COMPLAINT ON MUSIC DIRECTOR DEVI SRI PRASAD : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై హైదరాబాద్​ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు నమోదైంది. హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ఒపరి ఐటెం సాంగ్‌గా వాడారంటూ సినీ నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాల నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. వెంటనే దేవుడి మంత్రాన్ని పాట నుంచి తొలగించాలని.. లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details