ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్కంఠ నడుమ పాలపాడు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ - narasaraopeta rdo

తీవ్ర ఉత్కంఠ నడుమ గుంటూరు జిల్లా పాలపాడు ఎంపీటీసీ స్థానానికి తెదేపా అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ పర్వంలో స్థానిక డీఎస్పీ సాయంతో పులిమి భారతి నామినేషన్ దాఖలు చేశారు.

Filing nomination for the position of Palapadu MPTC amid tension
ఉత్కంఠ నడుమ పాలపాడు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు

By

Published : Mar 13, 2020, 1:54 PM IST

ఉత్కంఠ నడుమ పాలపాడు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు

గుంటూరు జిల్లా పాలపాడు ఎంపీటీసీ స్థానానికి తెదేపా అభ్యర్థి పులిమి ప్రతిభా భారతి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్థానిక డీఎస్పీ ఆధ్వర్యంలో ఆమె నామపత్రం సమర్పించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు పాలపాడు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయడానికి పులిమి రామిరెడ్డి వెళ్తుండగా వైకాపా కార్యకర్తలు అడ్డగించి దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత రామిరెడ్డి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. అనంతరం తన కోడలు ప్రతిభా భారతిని తీసుకుని పోలీసుల సహాయంతో నామినేషన్ సమర్పించడానికి వెళ్లగా సమయం మించిపోయినందున నామినేషన్​ను తీసుకోలేదు. దీనిపై మరుసటిరోజు ఎన్నికల కమిషన్ కు రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందించిన ఎన్నికల కమిషన్ వెంటనే నరసరావుపేట ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామంతో స్థానిక డీఎస్పీ పాలపాడు గ్రామానికి వెళ్లి భారతితో నామినేషన్ వేయించారు.

ఇదీచదవండి.

కరోనా ఎఫెక్ట్​.. రాష్ట్రంలో కంట్రోల్​ రూం ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details