గుంటూరు జిల్లా వల్లభాపురం గ్రామంలో బుధవారం రాత్రి వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి ఇరువురికి గాయాలు ఆయ్యాయి. కొల్దిపర ఎస్సై బలరామిరెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. వైకాపాకు చెందిన రాహుల్ రెడ్డి, ఉత్తేజ్ రెడ్డి మరికొందరు గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళుతున్నారు. మార్గమధ్యలో తెదేపాకు చెందిన దిలీప్ రెడ్డి ఇంటి సమీపం నుంచి వెళ్తున్న క్రమంలో గొడవ జరిగింది. తమను ఉద్దేశించి దిలీప్ రెడ్డి, అతని బాబాయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఒకరిని ఒకరు కర్రలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలో ఇరువురికి స్వల్ప గాయాలు అయినట్లు ఎస్సై వివరించారు. కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. కర్రలతో దాడి - vallabhapuram lo ycp tdp godava
గుంటూరు జిల్లాలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. పార్టీల పేరు చెప్పుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. వల్లభాపురం గ్రామంలో వైకాపా, తెదేపా కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు.

fight between ysrcp,tdp