ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ ఎఫెక్ట్: గుంటూరు జిల్లాలో ఎరువుల దుకాణాలు మూసివేత - Guntur District news

కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో.. గుంటూరు జిల్లాలోని ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల దుకాణాలు మూసేశారు. నేటి నుంచి 10 రోజులపాటు ఈ నిర్ణయం కొనసాగుతోందని డీలర్లు వెల్లడించారు.

Fertilizer Shops closed in Guntur district
Fertilizer Shops closed in Guntur district

By

Published : May 1, 2021, 2:51 PM IST

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా డీలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు దుకాణాలు మూసివేయనున్నారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి తెరవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోనున్నారు.

కొందరు వ్యాపారులు, దుకాణాల్లో పనిచేసే కూలీలు సైతం కరోనా బారిన పడ్డారు. షాపులు తెరిస్తే మరింత ఎక్కువ మంది కొవిడ్ కు గురయ్యే అవకాశముంది. అదే జరిగితే రాబోయే ఖరీఫ్ సీజన్ కు ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఎరువులు, విత్తనాల దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details