ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నా బంగారం, బుజ్జి... మందు తీసుకురా తల్లీ! - wines

ఈ చిన్నారి తల్లులను చూస్తే.. బాధేస్తోంది. దుర్మార్గుడైన ఆ తండ్రి తీరును అర్థం చేసుకోలేని వారి అమాయకత్వం.. ఆవేదన కలిగిస్తోంది. గుంటూరు జిల్లాలో తన కూతుళ్లను.. బార్​కు తీసుకెళ్లిన ఈ నీఛుడి వ్యవహారం.. తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

father_took_the_childrens_into_wine_shop

By

Published : Aug 12, 2019, 9:05 PM IST

Updated : Aug 13, 2019, 8:22 AM IST

పిల్లల ముందు మద్య పానం చేయాలంటే.. ఏ తండ్రి అయినా కాస్త ఆలోచిస్తాడు. తను కన్న పిల్లల ముందు తాగాలంటే.. ప్రేమతో కాస్త భయపడతాడు కూడా. ఇక.. ఆడపిల్లలకు మాత్రం ఆ వాసనే దారి దాపుల్లోకి రానివ్వకుండా.. వారికి దూరంగా మందు తాగేస్తుంటారు చాలామంది తండ్రులు. కానీ... గుంటూరు జిల్లాలో ఓ మహానుభావుడు అమానవీయంగా ప్రవర్తించాడు. తన చిన్నారి కూతుళ్లను బార్​కు​ తీసుకెళ్లి ..వారితోనే మద్యం తెప్పించుకుని మరీ తాగేశాడు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ బార్​లో.. చిన్న పిల్లలైన తన కూతుర్లతో మద్యం తెప్పించి షాపులోనే...మందు బాబుల మద్యలో ఉంచి మద్యం తాగాడు. అందరూ చూస్తున్నా.. ఏ మాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా తన పని తాను పూర్తి చేసుకున్నాడు. పైగా.. ఆ చిట్టి తల్లులకు సుద్దులు కూడా చెప్పాడు. తండ్రి తీరును అర్థం చేసుకోలేని ఆ బంగారు తల్లులు మాత్రం.. అమాయకంగా తలూపడం చూస్తుంటే.. అయ్యో.. అని అనుకోనివారు ఉండరు.

'నా బంగారం, బుజ్జి...మందు తీసుకురా నాన్న!'

వాస్తవానికి.. చిన్నారులను మద్యం దుకాణాల్లోకి అనుమతించకూడదు. అలాంటిది షాపులోకి చిన్నారులను తీసుకెళ్లడమే కాదు.. వారితోనే తెప్పించుకుని.. వారి ఎదుటే ఇలా ప్రవర్తిస్తున్నా... షాపు నిర్వాహకులు అడ్డు చెప్పలేదు. తోటి మందుబాబులు అడ్డుకోలేదు. ఇలా అయితే చిన్న పిల్లలు కూడా పెడదోవ పడతారని.. అధికారులు స్పందించాలని.. ఈ వ్యవహారాన్ని గమనించిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పిల్లల తండ్రితోపాటు.. షాపు యజమానులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Last Updated : Aug 13, 2019, 8:22 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details