AP Crime News : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి.. కుమార్తె విషయంలో అమానుషంగా ప్రవర్తించాడు. మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కుమార్తెను బెదిరించి తండ్రి పలుమార్లు అత్యాచారం చేసేవాడని, ఈ విషయం అమ్మకు చెబితే చంపేస్తానని బెదిరించేవాడు ఆ తండ్రి. కుమార్తె ఇంటర్మీడియట్ నర్సింగ్ రెండో సంవత్సరం పూర్తి చేసుకుని సెలవులకు ఇంటికి వచ్చింది. తన తండ్రి మళ్లీ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు. మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దపడింది. బాలిక బంధువులు అడ్డుకోని ఆమెను కాపాడారు. బాలిక తల్లి.. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం బాలిక తల్లి తాడికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు.
కేసులో ముద్దాయిగా ఉన్న టీడీపీ నేతకు అస్వస్థత : వైయస్సార్ జిల్లా కమలాపురం రిమాండ్ ముద్దాయిగా ఉన్నటువంటి టీడీపీ నేత దాది రామయ్య అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి వైఎస్సార్సీపీ నాయకుడు శంకర్ రెడ్డి హత్య కేసులో అరెస్టు అయ్యారు. ఉన్నట్టుండి దాది రామయ్య జైలులో కుప్పకూలారు. జైలర్ మరియు సిబ్బంది హుటాహుటిన సబ్ జైలు నుంచి కమలాపురం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యుడు అక్కడి నుండి కడప రిమ్స్‌కు సిఫార్సు చేశారు.
కమలాపురం వైద్యశాలలో ఉన్నటువంటి దాది రామయ్యను టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఒత్తిడితో సంబంధం లేని కేసులో పోలీసులు అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. దాది రామయ్యకు ఏమైనా జరిగితే దాని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కడప ఎస్పీ, కమలాపురం సీఐ, ఎస్ఐలదే పూర్తి బాధ్యత అని అన్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వైఖరికి నిరసనగా ధర్నా కూడా నిర్వహిస్తామని నరసింహారెడ్డి తెలిపారు.
తమిళ యువతిపై లైంగిక హింస : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ తమిళనాడుకు చెందిన యువతిపై లైంగికంగా హింసకు పాల్పడ్డాడు. తనపై సదరు సర్పంచ్ చేసిన లైంగిక ఆకృత్యాలను యువతి తమిళంలో వెల్లడించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. కుప్పం నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం తమిళనాడులోని ఆంబూరు పట్టణానికి చెందిన తనను లైంగికంగా హింసించినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. తాను రాజకీయ నాయకుడు అని తనపై ఎవరికి ఫిర్యాదు చేసినా నన్నేమీ చేసుకోలేవు అని బెదిరించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మామను హత్య చేసిన అల్లుడు :కుటుంబంలో జరిగే చిన్న చిన్న కలహాలు కారణంగా పిల్లనిచ్చిన మామను అల్లుడు హత్య చేసిన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. అల్లుడు దుస్తులు కత్తిరించే కత్తెర తీసుకొని మామను చాతిపైన పోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. బంధువులు మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అతను ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచాడు.