ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో కుమారుణ్ని చంపిన  తండ్రి - పారుపల్లిలో గొడ్డలితో దాడి చేసి కుమారుడిని హతమార్చిన తండ్రి

డబ్బు కోసం మద్యం మత్తులో కన్న కుమారుడినే నరికి చంపాడో తండ్రి. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం పారుపల్లిలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. మంచంలో నిద్రిస్తున్న బాజిబాబుపై అతడి తండ్రి వెంకటేశ్వర్లు గొడ్డలితో దాడి చేయగా.. బాధితుడు అక్కడికక్కడే మరణించాడు.

son murdered by father
మరణించిన బాజిబాబు

By

Published : Dec 5, 2020, 10:23 PM IST

మద్యం మత్తులో డబ్బు కోసం కుమారుడిని గొడ్డలితో హత్య చేశాడో తండ్రి. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా క్రోసూరు మండలం పారుపల్లిలో జరిగింది. మంచంలో నిద్రిస్తున్న బాజిబాబును అతడి తండ్రి వెంకటేశ్వర్లు గొడ్డలితో నరికి చంపి.. అక్కడి నుంచి పరారయ్యాడని బాధితుడి తల్లి తెలిపింది.

మరణించిన బాజిబాబు

వెంకటేశ్వర్లు మద్యం కోసం డబ్బు అడుగగా.. తన వద్ద లేవని బాజిబాబు సమాధానం చెప్పాడు. పరస్పరం ఇరువురూ వాగ్వాదానికి దిగి, నిందించుకున్నారు. అనంతరం మద్యం సేవించి వచ్చిన తండ్రి.. గొడ్డలితో దాడి చేయగా కుమారుడు అక్కడిక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details