Sons Harassing Father for Property: కష్టపడి పెంచి ఓ స్థాయికి తీసుకువెళ్లిన కుమారులు.. ఇప్పుడు తన పాలిట శత్రువులుగా మారారని వాపోయాడు ఓ తండ్రి. తనను ఆదుకోవాలంటూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వృద్ధుడు మహబూబ్ ఖాన్.. గుంటూరు ఎస్పీ గ్రీవెన్సుసెల్‌ను ఆశ్రయించారు. నగదుతోపాటు బంగారం, ఆస్తి కుమారులకు అప్పగించానని తెలిపారు. తీరా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి తనను వెళ్లిపొమ్మంటున్నారని ఆరోపించారు. తన భార్యను తన నుంచి విడదీశారని.. కుమార్తెను మానసిక వికలాంగురాలిగా మార్చారని ఆరోపించారు. ఉన్న కొంచం వ్యవసాయ భూమిని కుమార్తె వివాహం కోసం ఉంచగా.. ఆ పొలాన్ని సైతం పంచమని కుమారులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఉరి వేసుకుని చనిపోవడం మార్గంలా కనిపిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు న్యాయం చేయాలని మహబుూబ్ ఖాన్ కోరారు.
ఆస్తి కోసం వేధిస్తున్న కుమారులు.. పోలీసులను ఆశ్రయించిన తండ్రి - తెనాలి వార్తలు
Sons Harassing Father for Property: అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారులే ఆస్తికోసం తనను వేధిస్తున్నారంటూ.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వృద్ధుడు మహబూబ్ ఖాన్ ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌ను ఆశ్రయించారు. నగదుతోపాటు బంగారం, యావదాస్తి కుమారులకు అప్పగించానని.. తీరా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి తనను వెళ్లిపొమ్మంటున్నారని వాపోయాడు.
ఆస్తికోసం తండ్రిని వేధిస్తున్న కుమారులు
"వచ్చిన డబ్బు వచ్చినట్టు తీసుకొని పోతున్నారు. ఉన్న ఒక్క పొలం కుమార్తెకు ఇద్దామని ఉంచాను.. ఇప్పుడు అది కూడా ఇవ్వాలని అంటున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్తున్నారు. మానసికంగా స్థిమితం లేని అమ్మాయిని తీసుకొని.. నేను ఎక్కడకి వెళ్లాలి. నేనే వంట చేసుకుంటున్నాను. నా దగ్గరకి రాకుండా.. నన్ను అట్లా వదిలేస్తే.. అడుక్కుతిని అయినా బతుకుతాను". - మహబూబ్ ఖాన్, తెనాలి, గుంటూరు జిల్లా
ఇవీ చదవండి: