రాష్ట్ర భవిష్యత్ కోసం రైతులు తమ భూములు త్యాగం చేస్తే మంత్రులు అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని తెదేపా నేత కొమ్మలాపాటి శ్రీధర్ మండిపడ్డారు. బెల్లంకొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే..తమ పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'రాజధానిని తరలిస్తే పోరాటం మరింత ఉద్ధృతం' - అఖిలపక్షం, రైతులు, తెదేపా శ్రేణులతో ధర్నా వార్తలు
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెల్లంకొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
!['రాజధానిని తరలిస్తే పోరాటం మరింత ఉద్ధృతం' farmers, tdp leaders protest for capital city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5640978-505-5640978-1578488286372.jpg)
బెల్లంకొండలో అఖిలపక్షం, రైతులు, తెదేపా అందోళన