అమరావతి కోసం కృష్ణయ్యపాలెంలో చర్చిలో రైతుల ప్రార్థనలు - కృష్ణయ్యపాలెంలో రైతుల వినూత్న నిరసన
రాజధానిగా అవరావతినే కొనసాగించాలని కోరుతూ... గుంటూరు జిల్లా కృష్ణయ్యపాలెంలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. క్రైస్తవ కీర్తనలు పాడుతూ ర్యాలీ చేశారు. అనంతరం స్థానిక చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. ప్రజల ఆకాంక్షను దేవుడు నెరవేరుస్తారనే నమ్మకంతో చర్చిలో ప్రార్థనలు చేశామని రైతులు తెలిపారు.
కృష్ణయ్యపాలెంలో రైతుల వినూత్న నిరసన