ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నేతలారా.. న్యాయం వైపు నిలబడండి.. అమరావతిని కాపాడండి' - అమరావతి ఆందోళనలు

గుంటూరు జిల్లా నీరుకొండలో.. కొండవీటి వాగు వంతెనపై రైతులు ఆందోళన చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

farmers protests for amaravathi in neerukonda
farmers protests for amaravathi in neerukonda

By

Published : Dec 30, 2019, 11:16 AM IST

నీరుకొండలో రైతుల ధర్నా

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలో రైతులు ఆందోళన చేశారు. కొండవీటివాగు వంతెనపై నిరసనకు దిగారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రహదారిపై టైర్లు తగలబెట్టారు. మహిళలు వంటావార్పు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని కోరారు. ఈ సందర్భంలో తమ వైపు, న్యాయం వైపు నిలబడని నేతలకు విజ్ఞప్తి చేశారు. రాజధానిగా అమరావతిని కాపాడాలన్నారు. లేదంటే.. రానున్న కాలంలో వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మిగిలిన ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details