రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని కోరుతూ భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న సకల జనుల పోరాటానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ గుంటూరులోని తన నివాసంలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. రాజకీయ పార్టీల స్వార్ధపూరిత స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చి రోడ్డున పడ్డ 25 వేల మంది రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని కోరారు.
రాజధాని కోసం రావిపాటి సాయికృష్ణ నిరాహారదీక్ష - latest updated news ap capital
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలంటూ రాజధాని రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఏపీ పరిపరిక్షణ సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ గుంటూరులోని తన నివాసంలో 12 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు.
![రాజధాని కోసం రావిపాటి సాయికృష్ణ నిరాహారదీక్ష రాజధాని కోసం నిరాహారదీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8216726-565-8216726-1596018926903.jpg)
రాజధాని కోసం నిరాహారదీక్ష
రాష్ట్రం శాశ్వతం తప్ప ప్రభుత్వాలు శాశ్వతం కాదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధికి హాని కలిగే నిర్ణయాలను విరమించుకోవాలన్నారు. ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్నారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును రాష్ట్రపతికి పంపి రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులను నివేదించే విధంగా రాష్ట్ర గవర్నర్ ముందుకు వెళ్లాలని కోరారు.
ఇవీ చదవండి