అమరావతిలొనే రాజధాని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో తమ ఆవేదన వెలిబుచ్చారు. గత 4రోజులుగా నిరసన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆందోళన వ్యక్తం చేస్తూ తాడికొండ మండలం నిడుముక్కల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
"రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి" - నిడుముక్కల వద్ద రోడ్డుపై మహిళలు, చిన్నారుల నిరసనలు
తాడికొండ మండలం నిడుముక్కల వద్ద మహిళలు, పిల్లలు, వృద్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. నల్లజెండాలతో నిరసనలు చేస్తున్నారు. రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిడుముక్కల వద్ద రోడ్డుపై మహిళలు, చిన్నారుల నిరసనలు
TAGGED:
రైతుల నిరసన