గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద రాజధాని అమరావతికి సంఘీభావంగా రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దాదాపు గంటసేపు గుంటూరు-అమరావతి ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు బైఠాయించారు. 'రైతుల త్యాగాలను గుర్తిద్దాం... రాజధాని అమరావతిని కాపాడుకుందాం' అనే నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రహదారి పక్కనే వంటావార్పు చేపట్టారు.
'రాజధాని రైతుల త్యాగాలను గుర్తించండి' - అమరావతి తాజా న్యూస్
రాజధాని అమరావతికి సంఘీభావంగా తాడికొండలోని గుంటూరు-అమరావతి ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించారు. రైతుల త్యాగాలను గుర్తిద్దాం... రాజధాని అమరావతిని కాపాడుకుందామంటూ నినాదాలతో హోరెత్తించారు.
రాజధాని అమరావతికి సంఘీ భావంగా తాడికొండలో ధర్నా