ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీ పై చర్యలు తీసుకోవాలి' - గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్ద రైతుల నిరసన

'రైతు ప్రభుత్వం' అని చెప్పుకొనే వైకాపా.. అన్నదాతలకు జరిగిన అన్యాయం పై స్పందించి... చర్యలు తీసుకోవాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు విక్రయించి కర్షకులను మోసగించిన కళాషా కంపెనీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుతూ... రైతు సంఘాల నాయకులు నిరసన తెలిపారు.

farmers  protest for  demanding legal action against the Kalasha Company
రైతుల ధర్న

By

Published : Nov 24, 2020, 5:25 PM IST

అనుమతి లేని మిర్చి విత్తనాలను రైతులకు విక్రయించి వారిని రోడ్డుపాలు చేసిన కళాషా కంపెనీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ... గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు గ్రామంలో సుమారు 400 ఎకరాలలో రైతులు మిర్చిపంట వేసి నష్టపోయారని అన్నారు.

తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కళాషా కంపెనీ కి చెందిన మిరప విత్తనాలు వాడటం వలన.. మిరప పంటకు బొబ్బర తెగులు వచ్చి పంట అంతా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details