గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెం యూనియన్ బ్యాంక్ వద్ద కౌలు రైతుల ఆందోళనకు దిగారు. రాష్ట్ర కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో బ్యాంకు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదని రైతు సంఘం నేతలు విమర్శించారు. రుణ అర్హత పత్రాల మంజూరులోనూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
బ్యాంకు ముందు బైఠాయించిన రైతులు.. లావాదేవీలకు ఆటంకం - గుంటూరు జిల్లాలో కౌలు రైతులు ఆందోళన వార్తలు
పైసా అప్పు లేకుండా రుణాలు తీర్చుతున్న కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర కౌలు రైతుల సంఘం ఆందోళన చేపట్టారు. సమస్యను పరిష్కరించాలంటూ బ్యాంకు ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. బ్యాంకు లోపలకు ఎవర్నీ వెళ్లనీయకపోవటం లావాదేవీలకు కొంతవరకు ఆటంకం ఏర్పడింది.
బ్యాంకు ముందు బైఠాయించిన రైతులు
TAGGED:
dharna