అమరావతి ఉద్యమ ఐకాస నేత పులి చిన్నాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజధాని రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. చిన్నాపై దాడిని నిరసిస్తూ 29 గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు దీక్షా శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నల్ల రిబ్బన్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో అమరావతి ఐకాస నేతలు, పులి చిన్నా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తన భర్తపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన భార్య సువార్త కోరారు.
'పులిచిన్నా పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి' - amaravthi latest news
అమరావతి ఉద్యమ ఐకాస నేత పులి చిన్నాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజధాని రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. చిన్న పై దాడిని నిరసిస్తూ 29 గ్రామాలకు చెందిన రైతులు మహిళలు దీక్షా శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
తన భర్త పై దాడి చేసిన వ్యక్తులు రాత్రి వేళల్లో బైకులపై తిరుగుతూ వార్నింగ్ ఇస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసారి కొట్టడాలు ఉండవు చంపడమే అంటూ బెదిరిస్తున్నారని సువార్త వెల్లడించారు. శాంతియుతంగా ఉద్యమం జరుగుతున్న ప్రాంతంలో ప్రభుత్వం కావాలని అలజడులు సృష్టిస్తోందని ఐకాస నేతలు ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడమని ఐకాస నేతలు స్పష్టం చేశారు. చిన్నాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మరోవైపు పులిచిన్నా పై దాడి చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని తుళ్లూరు సీఐ దుర్గా ప్రసాద్ చెప్పారు.