పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ 263వ రోజూ రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, ఐనవోలు, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం, పెదపరిమి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బేతపూడి గ్రామాల్లో రైతులు దీక్షలో పాల్గొన్నారు.
ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. అబ్బరాజు పాలెంలో కోలాటంతో నిరసన తెలియజేశారు. వెంకటపాలెంలో చిన్నారులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. శాఖమూరులోని అంబేడ్కర్ స్మృతి వనంలో విగ్రహాలు మాయమవడంపై దళిత ఐకాస నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.