దేశంలో అభివృద్ధి పనుల కోసం.. రైతులు తమకు ప్రాణ సమానమైన భూములు ఇచ్చి రోడ్డుపాలు కావద్దని అమరావతి అన్నదాతలు అభ్యర్థించారు. పరిపాలన రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అంటూ రైతులు చేస్తున్న దీక్షలు 239 వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు మండలం మందడం వెలగపూడిలో రైతులు, మహిళలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. రాజధాని లేని అభివృద్ధి తమకు అవసరం లేదని రైతులు స్పష్టం చేశారు.
తామంతా రాజధాని కోసం భూములు ఇచ్చామని.. అది లేనప్పుడు తమ ప్రాంతం అభివృద్ధి చెందదని రైతులు చెప్పారు. ఎన్ని దసరాలు వచ్చిన వైకాపా ప్రభుత్వం విశాఖలో రాజధాని నిర్ణయించలేదని రైతులు తేల్చిచెప్పారు. ప్రభుత్వానికి న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా కనువిప్పు కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని.. ఈ విషయంలో తమతో చర్చలు జరిపి న్యాయం చేయాలని రైతులు కోరారు.