ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmer Protest: గుంటూరు ఛానల్​ పొడించాలని రైతుల పాదయాత్ర - గుంటూరు ఛానల్​ పొడించాలని కోరుతూ రైతుల పాదయాత్ర న్యూస్

గుంటూరు ఛానల్​ను పొడిగించాలని గత కొన్నేళ్లుగా వినతులు సమర్పించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఛానల్​ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ..ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన నల్లమడ వాగు రైతులు పాదయాత్ర చేపట్టారు.

గుంటూరు ఛానల్​ పొడించాలని కోరుతూ రైతుల పాదయాత్ర
గుంటూరు ఛానల్​ పొడించాలని కోరుతూ రైతుల పాదయాత్ర

By

Published : Oct 11, 2021, 6:48 PM IST

గుంటూరు ఛానల్​ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ..ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన నల్లమడ వాగు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రగా గుంటూరు ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయానికి చేరుకున్న రైతులు అక్కడ నిరసన తెలిపారు. గుంటూరు ఛానల్​ను పొడిగించాలని గత కొన్నేళ్లుగా వినతులు సమర్పించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ఆవేదనను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేసేందుకే పర్చూరు నుంచి పాదయాత్రగా గుంటూరు చేరుకున్నట్లు నల్లమడ వాగు రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహన్ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేలా గుంటూరు ఛానల్​ను పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఎస్‌ఈ కార్యాలయం అధికారులకు రైతులు వినతిపత్రం సమర్పించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details