ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers protest: 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతుల ఆందోళన - తుళ్లూరులో రైతులు ఆందోళన

farmers protest at guntur: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రైతుల ధర్నా చేపట్టారు. గొల్లపూడి నుంచి చినకాకాని వరకు నిర్మించే రహదారి వద్ద ఆందోళన నిర్వహించారు. 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారు తెలిపారు.

farmers protest at tulluru in guntur demanding to give compensation as per land acquisition law
2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతుల ఆందోళన

By

Published : Dec 1, 2021, 1:13 PM IST

farmers protest at venkatapalem: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రైతులు ఆందోళన నిర్వహించారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వకుండా పాత చట్టాన్ని వర్తింపజేసి అధికారులు, గుత్తేదారులు బలవంతంగా లాక్కున్నారంటూ.. అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

2011లో మంగళగిరి మండలం చినకాకాని నుంచి విజయవాడ గొల్లపూడి వరకు నిర్మించే జాతీయ రహదారి కోసం వెంకటపాలెంలో.. భూసేకరణ చేసినట్లు రైతులు తెలిపారు. తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి 2019 వరకు రహదారి నిర్మాణం చేయకుండా వదిలేశారని.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఐదేళ్లలో పనులు ప్రారంభించకపోతే భూములు రైతులకు తిరిగి ఇచ్చేయాలని ఉందని రైతులు చెప్పారు. సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణ సమయంలోనూ.. సీఆర్డీఏ అధికారులు సైతం తమను మోసం చేశారని ఆవేదన చెందారు. అధికారులు, గుత్తేదారులు, ప్రజాప్రతినిధులు కలసి తమను నట్టేట ముంచారని వాపోయారు. తమకు ఇప్పటికైనా నష్టపరిహారం ఇవ్వాలని.. లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని రైతులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details