గుంటూరు జిల్లా నరసరావుపేట మార్కెట్ యార్డు వద్ద పత్తి రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు ఎదుట పత్తిని తగలబెట్టి నిరసన చేపట్టారు. నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ, యలమంద, కె.ఎం అగ్రహారం, చింతలపాలెం గ్రామాల నుంచి చిన్న, సన్నకారు రైతులు మార్కెట్ యార్డులో పత్తిని విక్రయించేందుకు తీసుకువచ్చారు. అయితే అక్కడి కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన పత్తి నాణ్యత లేదంటూ కొనుగోలు చేసేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్ యార్డు ఎదుట ఆందోళనకు దిగారు.
నరసరావుపేట మార్కెట్ యార్డు వద్ద పత్తి రైతుల ఆందోళన
గుంటూరు జిల్లా నరసరావుపేట మార్కెట్ యార్డు ఎదుట పత్తి రైతులు ఆందోళనకు దిగారు. పత్తి కొనుగోలుకు అధికారులు నిరాకరించడంతో ఆగ్రహించిన రైతులు యార్డు ఎదుట పత్తి తగలబెట్టి నిరసన తెలిపారు. ఆందోళనలు చేస్తున్న రైతులతో యార్డు ఛైర్మన్ మాట్లాడారు. పత్తి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Farmers protest
యార్డు ఎదుట పత్తిని తగలబెట్టి నిరసన చేపట్టారు. అయినప్పటికీ మార్కెట్ యార్డ్ అధికారులు పట్టించుకోకపోవడంతో యార్డు ఎదుట ఉన్న కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ పత్తిని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
ఇదీ చదవండి :దమ్ముంటే నా పర్యటనను అడ్డుకోండి: పవన్