ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుణాలు ఇవ్వాలని కౌలుదారుల సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా

గుంటూరులో రుణాలు ఇవ్వాలని కౌలుదారుల సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. అన్నదాతలకు అప్పు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన బ్యాంకులు పట్టించుకోవడంలేదని కౌలుదారుల సంఘం నాయకులు రాధాకృష్ణ తెలిపారు.

By

Published : Nov 20, 2020, 2:45 PM IST

Farmers protest for crop cultivation loans
రుణాలు ఇవ్వాలని కౌలు దారుల సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా

పంట సాగుకు రుణాలు ఇవ్వాలని కోరుతూ రైతులు నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా మేడికొండూరు యూనియన్ బ్యాంక్ వద్ద కౌలుదారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నెలలు గడుస్తున్నా ఇంతవరకు బ్యాంకు రుణాలు ఇవ్వలేదని కౌలుదారుల సంఘం నాయకులు రాధాకృష్ణ ఆరోపించారు. రైతులకు అప్పు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన బ్యాంకులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఆర్​సీ కార్డులు, ఈ క్రాఫ్ట్ బుకింగ్... కారణాలు చెబుతూ బ్యాంకులో రుణాలు ఇవ్వట్లేదన్నారు. దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కౌలు రైతులకు రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు .

ABOUT THE AUTHOR

...view details