విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నివారించాలని కోరుతూ గుంటూరు జిల్లా మాచర్ల మండలం ద్వారకాపురి విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్తు ఏఈ మేకతోటి రాంబాబు రైతులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చిస్తానని అంతవరకు ఆందోళన విరమించాలని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ నిరసనలో జింకల సాంబయ్య, రమేష్, అంజయ్య, ఆనంద్, సేవనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాపురి విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులు నిరసన - guntur district newsupdates
గుంటూరు జిల్లా మాచర్ల మండలం ద్వారకాపురిలో విద్యుత్ ఉప కేంద్రం వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నివారించాలని.. రైతులు ఆందోళన నిర్వహించారు.

ద్వారకాపురి విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులు నిరసన
TAGGED:
గుంటూరు జిల్లా వార్తలు