ఉద్దండరాయుని పాలెం నుంచి విజయవాడ వరకు శుక్రవారం నాడు ఉదయం మహిళలు పాదయాత్ర చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు అనుమతి లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. పాదయాత్రలో ఎవరైనా పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 144 సెక్షన్, 30 పోలీసు యాక్టు అమలులో ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని తెలిపారు. ప్రజలు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకూడదన్నారు.
ఉద్దండరాయుని పాలెంలో పాదయాత్రకు అనుమతి లేదు: ఎస్పీ - అమరావతి కోసం మహిళలు ఆందోళనలు
ఇవాళ ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గగుడి వరకు పాదయాత్రకు అనుమతి లేదని... ఎవరైనా పాల్గొంటే చర్యలు తప్పవని... గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు.
గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు