కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి.. ముఖ్యమంత్రి మనసు మార్చి... అమరావతిలో రాజధాని ఉండేలా చూడూ అని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు శుక్రవారం బస్సులలో కోటప్పకొండకి తరలివెళ్లారు. మార్గమధ్యలో నాదెండ్ల మండలం గణపవరం వద్ద జేఏసీ నాయకులు ఓలేటి హేమంతరావు, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాజధాని రైతులకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని శీతలాంబ తల్లి వద్దకు పొంగళ్లు నెత్తిన పెట్టుకొని మహిళలు 'జై అమరావతి, 3 రాజధానులు వద్దు- అమరావతి ముద్దు' అంటూ నినాదాలతో పూజలు చేశారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గణపవరం వచ్చారు.
'త్రికోటేశ్వరుడే..సీఎం మనసు మార్చాలి' - కోటప్పకొండకు బస్సుల్లో బయలుదేరిన రాజధాని రైతులు
కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామే ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చి అమరావతిలో రాజధాని ఉండేలా చూడాలని కోరుతూ.. రాజధాని ప్రాంత రైతులు శుక్రవారం బస్సులలో కోటప్పకొండకి తరలివెళ్లారు.
రాజధాని రైతులకు గణపవరం గ్రామస్తులు ఘనస్వాగతం